Rishi Sunak | బ్రిటన్ పీఎం రేసులో వెనుబడి పోతున్నానని భారతీయ సంతతి నేత రిషి సునక్ అంగీకరించారు. ప్రస్తుతం బ్రిటన్ పీఎం రేసులో కన్సర్వేటివ్ పార్టీ నుంచి రిషి సునక్, లిజ్ ట్రస్‌లు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పార్టీ ఎంపీల మద్దతు విషయంలో ముందంజలో ఉన్న రిషి సునక్.. దేశవ్యాప్తంగా ఉన్న కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతును కూడగట్టడంలో వెనుకబడుతున్నారు. ఈ విషయాన్ని ఒక బహిరంగ చర్చా వేదికలో ఆయనే స్వయంగా అంగీకరించారు. పన్ను రేట్లను తగ్గించే విషయంలో తన ప్రతిపాదన అంతగా ఆమోదం పొందలేదన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేవరకు ఆదాయ పన్నురేట్లను తగ్గించడం కుదరదని Rishi Sunak పేర్కొనగా.. పీఎం పదవి చేపట్టిన వెంటనే పన్ను రేట్లను తగ్గిస్తానని లిజ్ ట్రస్ హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి..