దక్షిణాదిన కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. జూన్ నెల రాకముందే వర్షాలు కుమ్మేస్తున్నాయి. కర్ణాటకలో అయితే గరిష్ఠ స్థాయిలో వర్షం పడుతోంది. ఆయా నగరాల్లోని లోతట్టు కాలనీలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా బెంగళూరులో భారీగా వరదలు రావడంతో రోడ్లన్నీ నదుల్లా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా కర్ణాటకలో ఐదుగురు మృతి చెందారు. అటు మంగళూరులో బురదలో ఇళ్లు కూరుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎద్కొంటున్నారు.