Go First flight | `గో ఫ‌స్ట్` విమానాల‌పై డీజీసీఏ చర్య‌లు-go first flights suffer engine snags grounded scindia chairs meetings amid safety concerns ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Go First Flight | `గో ఫ‌స్ట్` విమానాల‌పై డీజీసీఏ చర్య‌లు

Go First flight | `గో ఫ‌స్ట్` విమానాల‌పై డీజీసీఏ చర్య‌లు

Published Jul 19, 2022 08:28 PM IST HT Telugu Desk
Published Jul 19, 2022 08:28 PM IST

`గో ఫ‌స్ట్` విమానాల‌పై DGCA చర్య‌లు ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తిన రెండు `గో ఫ‌స్ట్‌` విమానాల‌పై Directorate General of Civil Aviation చ‌ర్య‌లు తీసుకుంది. వాటిని విధుల్లో నుంచి త‌ప్పించాల‌ని విమానయాన సంస్థ `గో ఫ‌స్ట్‌`ను DGCA ఆదేశించింది. ముంబై నుంచి లేహ్ వెళ్లాల్సిన గో ఫ‌స్ట్ విమానాన్ని ఇంజిన్‌లో స‌మ‌స్య త‌లెత్త‌డంతో అత్య‌వ‌స‌రంగా ఢిల్లీలో ల్యాండ్ చేశారు. శ్రీన‌గ‌ర్ నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరిన మరో గో ఫ‌స్ట్‌` విమానంలోనూ ఇంజిన్‌లో స‌మ‌స్య రావ‌డంతో తిరిగి శ్రీన‌గ‌ర్‌కు తీసుకువెళ్లారు. దాంతో ఈ రెండు ఎయిర్‌బ‌స్ 320 నియో విమానాల‌ను ప‌క్క‌న‌పెట్టాల‌ని డీజీసీఏ `గో ఫ‌స్ట్‌`ను ఆదేశించింది. దేశీయ విమానయాన సంస్థ‌ల‌కు చెందిన విమానాల్లో త‌ర‌చుగా స‌మ‌స్య‌లు త‌లెత్తుతుండ‌డంపై కేంద్ర విమాన‌యాన శాఖ స్పందించింది. డీజీసీఏ అధికారుల‌తో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమ‌వారం నుంచి మూడు వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించారు. మ‌రిన్ని వివ‌రాలు ఈ వీడియోలో..

More