Indigo Flight vs Car | విమానాన్ని ఢీకొట్టిన కార్.. తర్వాతేమైంది? ఈ వీడియో చూడండి
గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఒక కారు రన్‌వేపై బయలుదేరేందుకు సిద్ధంగా ఇండిగో ఎ320 నియో ఎయిర్‌క్రాఫ్ట్ కిందకు దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి పాట్నాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం ముందు చక్రాన్ని స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించాడేమో అని అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, నెగెటివ్ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఏదేమైనా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా DGCA - సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ చూడండి.