Engine problem in Indigo flight | ఇండిగో విమానంలోనూ స‌మ‌స్య‌-dgca steps in as delhi vadodara indigo flight gets diverted to jaipur after engine glitch ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Engine Problem In Indigo Flight | ఇండిగో విమానంలోనూ స‌మ‌స్య‌

Engine problem in Indigo flight | ఇండిగో విమానంలోనూ స‌మ‌స్య‌

Published Jul 15, 2022 10:18 PM IST HT Telugu Desk
Published Jul 15, 2022 10:18 PM IST

Engine problem in Indigo flight | దేశీయ విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌యాణీకుల ప్రాణాల‌తో ఆట‌లాడుకుంటున్నాయి. విమానాల్లో సాంకేతిక స‌మ‌స్య‌ల‌కు సంబంధించి 24 రోజుల్లో 9 ఘ‌ట‌న‌లతో స్పైస్ జెట్ ఈ రేసులో ముందుంది. ఈ ఘ‌ట‌న‌ల‌పై డీజీసీఏ (Director-General of Civil Aviation) స్పైస్‌జెట్ సంస్థ‌కు నోటీసులు జారీ చేసి, వివ‌ర‌ణ తీసుకుంది. మ‌రోవైపు, తాజాగా మ‌రో దేశీ విమానయాన సంస్థ‌ ఇండిగో కూడా స్పైస్ జెట్ బాట‌లో న‌డుస్తోంది. జులై 14న ఢిల్లీ నుంచి గుజ‌రాత్‌లోని వ‌దోద‌ర‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో స‌మ‌స్య తలెత్తింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తి, ఇంజిన్‌లో నుంచి వైబ్రేష‌న్ వ‌స్తుండ‌డంతో, పైల‌ట్‌ వెంట‌నే విమానాన్ని డైవ‌ర్ట్ చేసి, రాజ‌స్తాన్‌లోని జైపూర్‌లో ల్యాండ్ చేశారు. ఆ త‌రువాత‌, వేరే విమానంలో ప్ర‌యాణీకుల‌ను వ‌దోద‌ర‌కు పంపించారు. ఈ ఘ‌ట‌న‌పై Director-General of Civil Aviation స్పందించింది. ఇండిగో సంస్థ‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివ‌రాల‌కు ఈ వీడియో చూడండి.. 

More