పహల్గాం ఉగ్రదాడి తర్వాత అక్రమ వలస దారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. వెతికి వెతికి మరీ అక్రమ వలస దారుల నిర్మాణాలు కూల్చి వేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే గుజరాత్ అహ్మదాబాద్లోని చందోలా ప్రాంతంలో 2.5 లక్షల చదరపు మీటర్లకు పైగా ఉన్న విస్తీర్ణంలో అక్రమ ఆక్రమణలు తొలగిస్తున్నారు. మొదటి దశలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న సుమారు 1.5 లక్షల చదరపు అక్రమ ఆక్రమణలు కూల్చి వేశారు. ఇప్పుడు మరోసారి అదే రీతిలో చేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.