Video: అలా చేస్తే భారత్ ఎవర్నీ వదిలిపెట్టదు.. చైనాకు రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్-defence minister rajnath singh strong warning to china during his us visit ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Video: అలా చేస్తే భారత్ ఎవర్నీ వదిలిపెట్టదు.. చైనాకు రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

Video: అలా చేస్తే భారత్ ఎవర్నీ వదిలిపెట్టదు.. చైనాకు రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

Apr 16, 2022 06:41 AM IST HT Telugu Desk
Apr 16, 2022 06:41 AM IST

చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్. తమకు హానీ తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌, అమెరికా మధ్య 2+2 చర్చల్లో భాగంగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్ - చైనా సరిహద్దు వివాదంపై స్పందించిన రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులు ఏం చేశారో.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో బహిరంగంగా చెప్పలేనని.. అయితే భారత్‌కు హాని కలిగిస్తే ఎవర్నీ విడిచిపెట్టబోమన్న స్పష్టమైన సందేశం మాత్రం వారికి కచ్చితంగా వెళ్లిందని చెప్పలగనంటూ  చైనాను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారత్‌ శక్తిమంతమైన దేశంగా ఎదిగిందన్నారు. 2020 సంవత్సరం జూన్ నెలలో గాల్వాన్ లోయలో భారత్ - చైనా బలగాల మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు మరణించగా.. చైనా సైనికులు భారీ స్థాయిలో చనిపోయిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

More