cold storage godown collapses| కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ పై కప్పు కూలి 8 మంది మృతి
- ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్‌లో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనా విషయం తెలుసుకున్న SDRF, NDRF బృందాలు వెంటనే వచ్చి సహాయక చర్యలు చేపట్టాయి. 11 మందిని రక్షించారు. అయితే ఇంకా కొంత మంది శిథిలాల కిందనే ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.