SpiceJet Problems | డేంజర్ ఫ్లైట్.. `స్పైస్‌జెట్`
గత పది రోజులుగా స్పైస్ జెట్ విమానాల్లో వరుసగా సమస్యలు తలెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితం ఢిల్లీ నుంచి జబల్పూర్ వెళ్తున్న విమానంలోని క్యాబిన్‌లో పొగలు రావడంతో, తిరిగి వెనక్కు తీసుకువచ్చి, ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తరువాత దుబాయి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఫ్యూయెల్ లీక్ అవుతోందన్న అనుమానంతో, విమానాన్ని దారి మళ్లించి, పాకిస్తాన్‌లో ల్యాండ్ చేశారు. తాజాగా, కోల్‌కతా నుంచి బయల్దేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి, కలకత్తాలో దింపేశారు. అందులో వాతావరణ వివరాలు తెలిపే వ్యవస్థలో లోపం తలెత్తినట్లు గుర్తించారు. ఇటీవల మరో విమానంలో మిర్రర్‌లో పగులును గుర్తించారు. ఇలా ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్పైస్‌జెట్ సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దాంతో, స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు కట్టుబడి ఉన్నామని, తమ విమానాలు అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయని వివరించింది.