జాబిల్లిపై దిగిన విక్రమ్ ల్యాండర్ తనకు అప్పగించిన పనిని మెుదలు పెట్టింది. దక్షిణ ధ్రువ ప్రాంత ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇస్రోకు పంపింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన ఇస్రో.. చంద్రుడిపై వైరుధ్య ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వెల్లడించింది. జాబిల్లి ఉపరితలంపై, ఉపరితలం లోపల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉన్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధిత థర్మల్ గ్రాఫ్‌ను ఇస్రో ఆదివారం విడుదల చేసింది.