దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించటంతో ఉత్తర్ ప్రదేశ్ లో వధూవరులు పెళ్లి మండపంలోనే సంబరాలు చేసుకున్నారు. టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని వధూవరులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి ఈ సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాతో ఫొటోలు దిగారు. వధూవరుల కుటుంబ సభ్యులు క్రికెటర్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని పట్టుకున్నారు. టీమిండియా విజయం సందర్భంగా వధూవరులే కాకుండా బంధువులు, పెళ్లికి వచ్చిన అతిథులు ఆనందంలో మునిగి తేలారు. ఈ సంబురాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.