Reverse waterfall video: మహారాష్ట్రలోని నానేఘాట్‌లో అబ్బురపరిచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. జలపాతంతో కిందికి పడుతున్న నీరు.. పూర్తిగా కింద పడకుండా పైకి లేస్తుండడం విస్మయపరుస్తుంది. నానేఘాట్ కొంకణ్ తీరం, పశ్చిమ కనుమలలో గల పురాతన పట్టణం జున్నార్ మధ్య ఉన్న పర్వత మార్గం. నీరును పైకి నెట్టడంపై శాస్త్రీయ వివరణ ఇస్తూ నెటిజన్లు న్యూటన్ మొదటి చలన నియమాన్ని ఉదహరించారు. ఒక ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్ ద్వారా స్పందిస్తూ గ్రావిటీకి వ్యతిరేకంగా సమానమైన గాలి వేగంగా వీస్తున్నప్పుడు ఇలాంటి దృశ్యం కనిపించిందని ప్రస్తావించారు.