BJP vs Mamata Cops; యుద్ధభూమి.. కోల్ కతా
BJP vs Mamata Cops; పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా మంగళవారం యుద్ధ భూమిగా మారింది. బీజేపీ శ్రేణులు ఒకవైపు, పోలీసులు మరోవైపు, నగరాన్ని రణరంగం చేశారు. బీజేపీ చలో సెక్రటేరియట్ పిలుపు నేపథ్యంలో ఈ ఉద్రిక్తత నెలకొన్నది. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు సెక్రటేరియట్ కు వెళ్లేందుకు విఫల యత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో, వారిపై రాళ్లు, కర్రలు, టైర్లతో దాడులు చేశారు. లాల్ బజార్ ప్రాంతంలో ఒక పోలీసు వాహనాన్ని తగలబెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు, లాఠీ ఛార్జీతో ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతా లో జరిగిన విధ్వంసం ఈ వీడియోలో చూడండి..