Communal clashes in UK | బ్రిటన్ లోని స్మెదక్ పట్టణంలోని దుర్గ భవన్ హిందూ సెంటర్ పై ముస్లిం వర్గాలు దాడికి ప్రయత్నించాయి. గత కొన్ని వారాలుగా యూకేలోని లెస్టర్ పట్టణం లో మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 28న జరిగిన ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ అనంతరం ప్రారంభమైన ఈ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, స్మెదక్ లోని హిందూ సెంటర్ పై దాడికి ప్రయత్నించారు. అల్లా హో అక్బర్ అని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వచ్చిన ఆందోళనకారులు హిందూ సెంటర్ లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించి, చెదరగొట్టారు. ఈ సెంటర్ లో సాధ్వి రితంబర ప్రసంగ కార్యక్రమం ఉండగా, ఆమె ఆరోగ్యం బావుండకపోవడంతో, ఆ కార్యక్రమం రద్దైంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో..