Telugu News  /  Video Gallery  /  Anand Mahindra Wins Internet With Incredible Reply To Are You An Nri Question Watch This Video

Anand Mahindra: నెటిజన్ల మనసు గెలుచుకున్న ఆనంద్ మహీంద్ర

07 July 2022, 12:05 IST HT Telugu Desk
07 July 2022, 12:05 IST

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియా యూజర్‌కు ఇచ్చిన సమాధానం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. మీరు ఎన్‌ఆర్ఐ(నాన్ రెసిడెంట్ ఇండియన్) నా? అని ఓ యూజర్ ప్రశ్నించగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ యూజర్‌కు అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ‘న్యూయార్క్‌లో ఉన్న కుటుంబాన్ని సందర్శిస్తున్నాను. కాబట్టి నేను హెచ్‌ఆర్‌ఐ(హార్ట్ రెసిడెంట్ ఇండియా)ని. హృదయం (ఎల్లప్పుడూ) భారతదేశంలోనే ఉంటుంది..’ అని మహీంద్రా చెప్పారు. అతని చమత్కారమైన స్పందనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మాన్‌హట్టన్ స్కైలైన్ అందాలను ప్రదర్శిస్తూ జూలై 4న ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్‌కు ప్రతిస్పందనగా ట్విట్టర్ యూజర్ ఈ ప్రశ్న సంధించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More