Security breach in Amit Shah tour | అమిత్ షా పర్యటనలో సెక్యూరిటీ లోపం
Security breach in Amit Shah tour | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలి ముంబై పర్యటన సందర్భంగా భారీ సెక్యూరిటీ లోపం బయటపడింది. కేంద్ర హోం శాఖ అధికారి నంటూ ఒక వ్యక్తి మలబార్ హిల్స్ ప్రాంతంలో, సీఎం షిండే, డెప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ నివాసాల వద్ద తచ్చాడాడు. ఆ వ్యక్తి కదలికలను అనుమానించిన ఏసీపీ తనను ప్రశ్నించగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారినని ఐడీ కార్డు చూపాడు. మరింత లోతుగా ప్రశ్నించగా, అసలు నిజం బయటపడింది. ఆ వ్యక్తిని హేమంత్ బన్సీలాల్ పవార్ గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఆ వ్యక్తి వద్ద ఒక తెలుగు ఎంపీ కి వ్యక్తిగత కార్యదర్శి అనే ఐడీ కార్డు కూడా లభించడం విశేషం.