ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. ఓవైపు శాంతి చర్చలు జరుపుతూనే మరో వైపు భారత్ పై దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. తాజాగా జమ్ముకశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో దాడులకు దిగింది. సాంబా, కథువా సెక్టార్లలో డ్రోన్లతో దాడులు చేసింది. వెంటనే అప్రమత్తం అయిన భారత సైన్యం పాక్ డ్రోన్లను అడ్డుకొని కూల్చేసింది.