చంద్రయాన్-3 తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మిషన్.. ఆదిత్య ఎల్-1. ఈ మిషన్ కూడా సూర్యుడి వైపు దిగ్విజయంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆదిత్య ఎల్1 ఓ సెల్ఫీని తీసుకుంది. అలాగే భూమి, చంద్రుని ఫొటోలను కూడా తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ గురువారం తెలిపింది. భూమి, చంద్రుడు, ఆదిత్య ఎల్1 ఈ మూడు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోలను ఇస్రో పోస్ట్ చేసింది.భూమి నుండి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న తన గమ్యస్థానమైన లాంగ్రేగియన్ పాయింట్‌కు చేరుకునే క్రమంలో ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది.