North East Express: పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి-4 dead as 21 coaches of north east superfast train derail in buxar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  North East Express: పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి

North East Express: పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి

Published Oct 12, 2023 10:43 AM IST Muvva Krishnama Naidu
Published Oct 12, 2023 10:43 AM IST

  • బిహార్‌లోని బక్సర్ జిల్లాలోని ఘోర రైలు ప్రమాదం జరిగింది. రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి వేళ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు... అక్కడికక్కడే మృతి చెందారు. మరో 70 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో, రైలు బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ లో బయల్దేరి, గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌ వెళ్తోంది. ఈ రైలు 21 కోచ్ లతో వెళ్లింది. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయ చర్యలు ముమ్మరం చేసింది రైల్వేశాఖ. పట్టాలపై పడి ఉన్న బోగీలను పక్కకు తీసివేస్తున్నారు. ట్రాకుకు మరమ్మతులు చేస్తున్నారు.

More