ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కోసం నోటీసులు అందుకున్న BRS ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున, ఢిల్లీకి రాలేనంటూ మెయిల్ ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీకి తెలిపారు. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు రావడం.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవితను ఇప్పటికే పలుసార్లు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.