వ్యాయామంతో శారీరకంగానే కాదు, మానసికంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. అయితే మహిళల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అవసరం. COVID-19 మహమ్మారి తర్వాత శారీరక శ్రమ కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం పురుషుల కంటే ఎక్కువగా ప్రభావితమయినట్లు ఇటీవలి పరిశోధనలు రుజువు చేశాయి. వారంలో ప్రతీరోజూ ఎంత శారీరక శ్రమ ఉంటుంది, ఆహరపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి అంశాలు పరిగణలోకి తీసుకొని స్త్రీ, పురుషుల మానసిక ఆరోగ్యంపై అధ్యయనం చేపట్టగా, అధిక వ్యాయామం స్త్రీల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే పురుషులకు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వ్యాయామం మంచి ప్రభావం చూపినట్లు తెలిపారు. న్యూయార్క్‌లోని బింగ్‌హామ్‌టన్ విశ్వవిద్యాలయం ఈ రీసెర్చ్ చేసింది. ఈ వీడియో చూడండి.