మైగ్రేన్‌తో బాధపడుతున్న మహిళలకు గర్భధారణలో సమస్యలు వస్తాయని తాజాగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ముందస్తు డెలివరీ, గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, ప్రీఎక్లాంప్సియా వంటి గర్భధారణ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రాథమిక అధ్యయనం తెలిపింది. ప్రీఎక్లాంప్సియా అనేది గర్భధారణ సమయంలో మూత్రంలో ప్రోటీన్ వంటి అదనపు లక్షణాలతో కూడిన అధిక రక్తపోటును కలిగి ఉంటుంది. ఇది తల్లి,బిడ్డ జీవితానికి ముప్పు కలిగిస్తుంది.