భారత్ లో లేటెస్ట్ ఐఫోన్ సిరీస్ అమ్మకాలు మొదలైంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు ఐఫోన్ ప్రేమికులు ముంబైలోని BKCలోని Apple స్టోర్ వెలుపల బారులు తీరారు. తమకు ఇష్టమైన యాపిల్ ఫోన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. గంటల తరబడి Apple స్టోర్ ముందు నిలబడ్డారు. మేడిన్ ఇండియా ఐఫోన్ 15ను సొంతం చేసుకున్నారు. వారంతా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ముంబైలోని BKCలోని Apple స్టోర్ వెలుపల ఉన్న వారితో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. మేడిన్ ఇండియా ఐఫోన్ 15ను దక్కించుకోవడానికి 17 గంటల పాటు క్యూలో వేచివున్నానని అహ్మదాబాద్ కు చెందిన వ్యక్తి ఒకరు తెలిపారు.