Italy Drought | కరువుతో కనుమరుగు అవుతున్న ఇటలీ 'అరోజ్' !-italy drought rice crops wiped out ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Italy Drought | కరువుతో కనుమరుగు అవుతున్న ఇటలీ 'అరోజ్' !

Italy Drought | కరువుతో కనుమరుగు అవుతున్న ఇటలీ 'అరోజ్' !

Published Jul 26, 2022 04:43 PM IST HT Telugu Desk
Published Jul 26, 2022 04:43 PM IST

  • యూరోప్ దేశాలను ఇప్పుడు కరువు భూతం పీడిస్తోంది. చల్లని దేశాలలో కూడా నేడు ఎండలు మండిపోతున్నాయి. ఇటీవల లండన్ లో చరిత్రలోనే తొలిసారిగా 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. ఇటు ఇటలీ దేశంలోనూ అదే పరిస్థితి ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇటలీ గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇటలీలోని అతి పొడవైన నది అయిన 'రివర్ పో' ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పరివాహక ప్రాంతాలన్నీ ఇసుక బీచ్‌లుగా మారాయి. ఎప్పుడూ జలకల ఉట్టిపడే మాగ్గియోర్, కోమోతో వంటి చెరువులు సైతం ఎండిపోయాయి. నీరు లేక ఇటలీలో వ్యవసాయం దారుణంగా దెబ్బతింది. ఇటలీలో వరి, ఇతర ధాన్యాలను ఎక్కువగా పండిస్తారు. వీటికి సమృద్ధిగా నీరు అవసరం అవుతుంది. కానీ కరువు కారణంగా పంటలు పండటం లేదు. వరిని స్పానిష్ భాషలో "అరోజ్" అంటారు. కరువుతో అరోజ్ కనుమరుగవుతుందని చెబుతున్నారు. యూరోప్ దేశాలలో చలికాలం కురిసే మంచు నీటి నిల్వలను పెంచుతుంది. గత శీతాకాలంలో మంచు సరిగ్గా కురవలేదు, వర్షాపాతం అసలే లేదు. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. ఫలితంగా కరువుతో యూరోప్ దేశాలు విలవిలలాడుతున్నాయి.

More