క్యాన్సర్ రోగి చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తరచుగా వింటూ ఉంటాం. వీటితో పోల్చితే ఈ మధ్య మెరుగైన ఫలితాలను ఇస్తున్న మరో చికిత్సే ఇమ్యునోథెరపీ. బయోలాజిక్ థెరపీ అని కూడా పిలిచే ఇమ్యునోథెరపీ, క్యాన్సర్‌తో పోరాడటానికి శరీరం సహజ రక్షణను పెంచే ఒక రకమైన క్యాన్సర్ చికిత్స. దీన్ని ఏ విధంగా చేస్తారు..? మునుపున్న థెరపీల కంటే ఎంత ప్రభావంతో పని చేస్తుందో విజయవాడ మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ ఆంకాలజీ సర్వీసెస్ లో హెచ్ఓడీ గా పని చేస్తున్న డాక్టర్ జి కృష్ణారెడ్డి మాటాల్లో తెలుసుకుందాం.