Google | గూగుల్ తమ ట్రాన్స్‌లేటర్‌లో మీ భాషను ఎందుకు పొందుపరుస్తుందో తెలుసా?-here is why google adding your language to their translator tool ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Google | గూగుల్ తమ ట్రాన్స్‌లేటర్‌లో మీ భాషను ఎందుకు పొందుపరుస్తుందో తెలుసా?

Google | గూగుల్ తమ ట్రాన్స్‌లేటర్‌లో మీ భాషను ఎందుకు పొందుపరుస్తుందో తెలుసా?

Jun 15, 2022 07:43 PM IST HT Telugu Desk
Jun 15, 2022 07:43 PM IST

  • అన్య భాషను అర్థం చేసుకోవడానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గూగుల్ సంస్థ కూడా అనేక భాషలను అనువదించుకునేలా తమ టూల్స్‌ను అభివృద్ధిపరుస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త భాషలను చేరుస్తూపోతుంది. ప్రస్తుతం గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లో 133 భాషలు అందుబాటులో ఉన్నాయి. మరి గూగుల్‌కు అవసరం ఏమిటి అనుకుంటున్నారా? ఎక్కువ శాతం ప్రజలు కొంతమేర ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇంగ్లీష్ అర్థం చేసుకొని వారు ట్రాన్స్‌లేటర్ ఉపయోగిస్తారు. వారి కోసమే గూగుల్ ట్రాన్స్‌లేటర్ టూల్ అందుబాటులోకి తెచ్చింది అని మీరు అనుకుంటే పొరబడినట్లే. ప్రాంతీయ భాషలపై అవగాహన లేనపుడు అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మయన్మార్ దేశంలో ఒకసారి ముస్లిం రోహింగ్యా మైనారిటీలపై తీవ్రమైన హింసాత్మక దాడులు జరిగాయి. ఈ విషయంలో ఫేస్‌బుక్ (మెటా) సంస్థ కూడా చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కారణమేంటంటే ఫేస్‌బుక్ అక్కడి ప్రాంతీయ భాషకు అనువాదాన్ని అందించలేకపోవడం, ప్రాంతీయ భాషపై అవాగాహానా రాహిత్యం వలన భారీ స్థాయిలో రెచ్చగొట్టే సమాచారం వ్యాప్తి చెందింది. ఈ రకంగా ఫేస్‌బుక్ కూడా హింసకు బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రాంతీయ భాషలో సమాచారం లేకపోతే అది ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థకైనా ప్రతికూలతే. కాబట్టి గూగుల్ ఈ రకంగా తమ సర్వీస్ అందిస్తుంది. ఇది కూడా పరోక్షంగా తమ వ్యాపార విస్తరణే. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

More