Dutch Farming | పాడి పశువులకు ప్రోటీన్ మేత.. పెరుగుతున్న అమ్మోనియా ఉద్గారాలు!-dutch farmers oppose reducing nitrogen emissions watch video ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Dutch Farming | పాడి పశువులకు ప్రోటీన్ మేత.. పెరుగుతున్న అమ్మోనియా ఉద్గారాలు!

Dutch Farming | పాడి పశువులకు ప్రోటీన్ మేత.. పెరుగుతున్న అమ్మోనియా ఉద్గారాలు!

Published Jul 14, 2022 07:27 PM IST HT Telugu Desk
Published Jul 14, 2022 07:27 PM IST

  • నెదర్లాండ్స్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చిన్న భూభాగంలోనే పెద్ద ఎత్తున పాడిపశువుల పెంపకం చేపడతారు. అక్కడ రైతుల్లో చాలా మందికి డైరీ పరిశ్రమ జీవాధారం. వినూత్న రీతుల్లో, ఆధునిక పద్ధతుల్లో పాల ఉత్పత్తిని చేస్తారు. అక్కడి పశువులకు ఎక్కువగా నాణ్యమైన సోయా, మొక్కజొన్నను మేతగా వేస్తారు. ఇలాంటి మేతను తినే పశువులు వాటి మూత్రం, మలంలో అమ్మోనియాను ఉత్పత్తి చేస్తాయి. అయితే తమ దేశంలో 2030 నాటికి కాలుష్య కారకాలు ప్రధానంగా నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా ఉద్గారాలను 50% తగ్గించాలని అక్కడి డచ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అమ్మోనియా ఉద్గారాలను తగ్గించే మార్గంగా తక్కువ ప్రొటీన్లు ఉన్న దాణాను పశువులకు మేతగా ఉపయోగించాలని ఆదేశిస్తోంది. ఈ నేపథ్యంలో డచ్ రైతులు తమ ప్రభుత్వంపై నిరసనకు దిగుతున్నారు. దాణా మారిస్తే తమ పాడివ్యవసాయం దెబ్బతింటుందని చెబుతున్నారు. డచ్ పాడి వ్యవసాయం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి.

More