Prathyusha Garimella | ఉన్నది ఒకటే జిందగీ.. ఆత్మహత్య పరిష్కారం కాదు!-celebrity fashion designer prathyusha garimella found dead at home did depression kill her ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Prathyusha Garimella | ఉన్నది ఒకటే జిందగీ.. ఆత్మహత్య పరిష్కారం కాదు!

Prathyusha Garimella | ఉన్నది ఒకటే జిందగీ.. ఆత్మహత్య పరిష్కారం కాదు!

Published Jun 12, 2022 02:07 PM IST HT Telugu Desk
Published Jun 12, 2022 02:07 PM IST

ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (35) హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకోవడం సినీ స్టార్లను, ఫ్యాషన్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆమె బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం ద్వారా చనిపోయినట్లు సమాచారం. ప్రత్యూషదే ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమె ఆఫీసు రూంలో ఒక లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యూష తన మరణానికి డిప్రెషన్ కారణమని ఆమె సన్నిహితురాలు, నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిప్రాయపడ్డారు. ప్రత్యూష గరిమెళ్ల ఇండియాలో టాప్ 3 సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. ఆమె దీపిక పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, రకుల్ ప్రీత్, నిహారిక లాంటి బాలీవుడ్- టాలీవుడ్ స్టార్లకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఉన్నది ఒకటే జీవితం డిప్రెషన్ కు గురైనపుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి, మెంటల్ హెల్త్ కేర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అంతేకానీ విలువైన ప్రాణాలను తీసుకోవద్దని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

More