KTR on Hyderabad : హైదరాబాద్ లో 2020లో వచ్చిన వరదలను దృష్టిలోపెట్టుకని.. స్ట్రాటజిక్ నాళా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో రూ. 3,866 కోట్లతో 31 కొత్త మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు కడుతున్నామని.. అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత మహానగరాల్లో 100 శాతం మురుగు నీటి శుద్ధి వ్యవస్థలు కలిగిన తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లో కొత్తగూడ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సందర్భంగా.. మంత్రి కేటీఆర్ ఈ వివరాలు వెల్లడించారు.