Snowfall In Kashmir : జమ్మూలో భారీగా హిమపాతం
- జమ్మూ కశ్మీర్లోని దోడలో విపరీతంగా మంచు కురుస్తోంది. జిల్లాలోని పైకప్పులు, చెట్లపై దట్టమైన మంచు దుప్పటి కప్పుకొంది. భారీ హిమపాతం తర్వాత దోడలోని ఎత్తైన ప్రదేశంలో ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయింది. మరోవైపు జమ్మూ, హిమచల్ రాష్ట్రాల నడుమ ప్రధాన రహదారి అయిన లేహ్-మనాలి మార్గంలో భారీ హిమపాతం కురుస్తోంది. దీంతో అధికారులు మార్గాన్ని మూసివేశారు.