Himayat Sagar - Osman Sagar: హైదరాబాద్ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. శుక్రవారం హిమాయత్ సాగర్ 2 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల అవుతుంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.70 అడుగులకు చేరింది. మరోవైపు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి క్రమంగా నీరు చేరుతుండటంతో… ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేతెపల్లి వద్ద ఉన్న మూసీ ప్రాజెక్ట్ నిండుకుండలా మారిపోయింది.