హిందీలో తన సినిమా `మార్క్ ఆంటోని` విడుదలకు సెన్సార్ బోర్డు లంచం తీసుకుందని హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. ముంబయిలోని సెన్సార్ బోర్డ్ కి సినిమా పంపినప్పుడు.. వాళ్లు సెన్సార్ చేయడానికి లంచం అడిగారని తెలిపారు. తప్పని పరిస్థితులో ఆరు లక్షల లంచం ఇచ్చినట్టు విశాల్ వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేస్తూ లంచం ఇచ్చిన విషయాన్ని వివరించారు. విశాల్ ఆరోపణలు చేయడంతోపాటు డబ్బులు పంపించిన అకౌంట్ డిటెయిల్స్ కూడా పోస్ట్ చేశారు. తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇటీవలే విశాల్, SJ సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మార్క్ ఆంటోనీ సినిమా విడుదల అయ్యాయి. మంచి విజయం సాధించింది. అయితే సౌత్ మొత్తం మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ అయ్యింది. హిందీలో మాత్రం సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.