వీడియో : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్పతరువు - దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తాం - హరీశ్ రావ్-harish rao power point presentation on kaleshwaram project ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్పతరువు - దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తాం - హరీశ్ రావ్

వీడియో : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్పతరువు - దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తాం - హరీశ్ రావ్

Published Jun 07, 2025 07:11 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 07, 2025 07:11 PM IST

“కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం - వాస్తవాలు” అనే అంశంపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.మేడిగడ్డ ప్రాజెక్టులో 85 పిల్లర్లకు కేవలం 2 మాత్రమే కుంగితే... మొత్తం ప్రాజెక్టే కూలిపోయినట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేదన్నారు. కానీ... కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామని... వాస్తవాలను వాళ్ల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్పతరువు వంటిందని… ఇలాంటి ప్రాజెక్ట్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామన్నారు. వీడియోను ఇక్కడ వీక్షించండి…

More