Hijab Protest: ఫుట్‍బాల్ మ్యాచ్‍కు వచ్చిన కొట్లాడుకున్న ఇరాన్ ఫ్యాన్స్.. దోహా స్టేడియం బయట..-fifa world cup 2022 iranian football fans brawl over anti hijab protest at doha stadium ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hijab Protest: ఫుట్‍బాల్ మ్యాచ్‍కు వచ్చిన కొట్లాడుకున్న ఇరాన్ ఫ్యాన్స్.. దోహా స్టేడియం బయట..

Hijab Protest: ఫుట్‍బాల్ మ్యాచ్‍కు వచ్చిన కొట్లాడుకున్న ఇరాన్ ఫ్యాన్స్.. దోహా స్టేడియం బయట..

Published Nov 30, 2022 01:45 PM IST Chatakonda Krishna Prakash
Published Nov 30, 2022 01:45 PM IST

  • Anti Hijab Protests: ఫిఫా ప్రపంచకప్‍ (FIFA World cup) లో భాగంగా మైదానంలో అమెరికాతో ఇరాన్ తలపడుతుంటే.. ఆ దేశ ఫ్యాన్స్ మాత్రం స్టేడియం బయట తలపడ్డారు. ఇరాన్ అభిమానులు రెండు గ్రూప్‍లుగా విడిపోయి కొట్టుకున్నారు. ఫిఫా ప్రపంచకప్‍ను చూసేందుకు ఖతార్‍కు చాలా మంది ఇరాన్ దేశస్థులు వచ్చారు. అయితే మ్యాచ్‍ల కోసమే కాకుండా హిజాబ్‍పై తమ స్వరాన్ని ప్రపంచానికి చెప్పేందుకు కూడా కొందరు వచ్చారు. అమెరికాతో ఇరాన్ మ్యాచ్ పూర్తయిన తర్వాత దోహా స్టేడియం బయట కొందరు ఇరాన్ ప్రజలు.. హిజాబ్‍కు వ్యతిరేకంగా నిరసన చేశారు. అదే సమయంలో ప్రో-ఇస్లామిక్ వాదులు వారితో వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

More