Fifa 2022: ఆ టీషర్ట్ వేసుకున్నందుకు స్టేడియంలోకి జర్నలిస్టుకు నో ఎంట్రీ.. కారణం ఇదే-fifa 2022 qatar stops us journalist from entering stadium over a tshirt ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Fifa 2022: ఆ టీషర్ట్ వేసుకున్నందుకు స్టేడియంలోకి జర్నలిస్టుకు నో ఎంట్రీ.. కారణం ఇదే

Fifa 2022: ఆ టీషర్ట్ వేసుకున్నందుకు స్టేడియంలోకి జర్నలిస్టుకు నో ఎంట్రీ.. కారణం ఇదే

Updated Nov 22, 2022 06:07 PM IST Chatakonda Krishna Prakash
Updated Nov 22, 2022 06:07 PM IST

  • FIFA World cup 2022 in Qatar: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచప్ కోసం వెళ్లిన ఓ అమెరికన్ జర్నలిస్టును అక్కడి సిబ్బంది స్టేడియంలోకి అనుమతించలేదు. రెయిన్‍బో టీషర్ట్ ధరించిన కారణంగా ఆయనను అడ్డుకున్నారు. సీబీఎస్ స్పోర్ట్స్ తరఫున గ్రాంట్ వాల్ అనే జర్నలిస్టు.. అమెరికా, వేల్స్ మధ్య మ్యాచ్‍ను కవర్ చేసేందుకు అహ్మద్ బిన్ అలీ స్టేడియానికి వెళ్లారు. అయితే అక్కడి సిబ్బందిని ఆయనను లోపలికి వెళ్లనివ్వలేదు. ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటీకి మద్దతుగా గ్రాంట్.. రెయిన్‍బో టీషర్ట్ ను ధరించినందుకు స్టేడియంలోకి అడుగుపెట్టనివ్వలేదు. తనను అక్కడి సిబ్బంది వేధించారని గ్రాంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖతార్ లో స్వలింగ సంపర్కం నేరంగా ఉంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More