గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అరుదైన గుర్తింపు సాధించారు. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్'లో సభ్యత్వం పొందారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో తారక్ స్థానం చోటు సంపాదించారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తారక్..ఇప్పుడు ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటింది. తొలి ఆస్కార్‌ను దేశానికి ఈ సినిమా అందించింది.