పాడుతా తీయగా ప్రొగ్రామ్ పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేశారు. పాడుతా తీయగా జడ్జీలపై లేడీ సింగర్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై సింగర్ సునీత స్పందించారు. 'ప్రవస్తి నిన్ను నేను బాల్యంలో ముద్దుచేశా. ఈ వయసులో అలా చేస్తే బాగుండదు. కానీ మా గురించి చర్చించే స్థాయికి నువ్వు వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది. ఆడియన్స్‌కు అన్ని విషయాలు చెప్పు' అంటూ పేర్కొన్నారు.