నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ గా న్యూ ట్యాలెంట్ రోర్స్ బ్యానర్ పై కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.