Jio World Plaza | అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్.. జియో వరల్డ్ ప్లాజా
- రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్‌ను నిర్మించింది. ఇవాళ ఈ మాల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. 'జియో వరల్డ్ ప్లాజా' పేరుతో కంపెనీకి చెందిన ఈ మాల్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 7,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. బల్గారీ, కత్యాయ్, లూయిస్ విట్టన్, వెర్సేస్, వాలెంటినో, మనీష్ మల్హోత్రా, అబు జానీ, సందీప్ ఖోస్లా, పోటరీ బార్న్ , అనేక ఇతర ఖరీదైన బ్రాండ్‌లు ఈ మాల్‌లో అందుబాటులో ఉంటాయి. మాల్ ప్రారంభానికి బాలీవుడ్ సినీ నటులు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ లో పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్ భర్తతో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, భూమి పెడ్నేకర్, ఖుషీ కపూర్, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితరులు హాజరయ్యారు.