ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి సదా. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం మూవీతో పరిచయమైంది. జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సదా.. నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. అయితే ప్రస్తుతం బుల్లితెర మీద షోలలో సదా మెరుస్తున్నారు. ఏమాత్రం యంగ్ హీరోయిన్లకు తీసిపోకుండా అందాన్ని కాపాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యింది. హాట్ హాట్ ఫోజోలు ఇస్తూ ఫోటో షూట్ చేస్తోంది. పెళ్లికి సదా సిద్ధమయ్యేలా ఫోటోలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.