కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి.. హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సప్తగిరి నటించిన తాజా చిత్రం పెళ్లికాని ప్రసాద్ మార్చి 21 విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. కమెడియన్ల పక్కన నటించేందుకు హీరోయిన్లు ఒప్పుకోరన్నారు. చాలామంది రిజెక్ట్ చేశారని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.