లండన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్ ఘనంగా జరిగింది. ఇందులో చిరంజీవి, బాలయ్య గురించి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించారు. ‘నాటు నాటు’లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు డ్యాన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాట గురించి తారక్ మాట్లాడుతూ.. ఈ పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్‌చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. చిరంజీవి ఎంతగొప్ప డ్యాన్సరో మనందరికీ తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్. వీళ్లిద్దరూ కలిసి నాటు నాటుకు డ్యాన్స్ వేస్తే ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. దీంతో హాల్ మొత్తం కేరింతలతో మారుమోగింది.