బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో ‘భైరవం’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' సినిమాతో హిందీలో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న సాయి శ్రీనివాస్.. ఇప్పుడు 'భైరవం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. తాజాగా శ్రీనివాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుమతో జరిగిన ఇంటర్వ్యూలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొంతమంది హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుందామని అనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.