హీరో ప్రియదర్శి నటించిన మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమాకు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రం సారంగపాణి జాతకం అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ట్రైలర్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 25కు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు.