హీరోగా శ్రీవిష్ణు చేసిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవాన హీరోయిన్స్. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దర్శకుడు అనిల్ రావిపూడి కమెడియన్ వెన్నెల కిషోర్ పై వేసిన పంచులు హైలెట్ గా నిలిచాయి.