తెలుగులో కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన సప్తగిరి.. అప్పుడప్పుడు హీరోగా చేస్తున్నాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' సినిమాతో హీరోగా పరిచయమైన హాస్య నటుడు.. 'సప్తగిరి ఎల్ఎల్‌బి' 'వజ్రకవచధర గోవింద' 'గూడుపుఠాణి' వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. ఈ సారి 'పెళ్లి కాని ప్రసాద్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో బ్రహ్మానందం పాల్గొన్నారు.