సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారను ప్రముఖ జ్యూవెలరీ సంస్థ పీఎంజే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. తాజాగా ఈ జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషనల్ యాడ్ ఫోటో షూట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఈ జ్యూవెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా సితారనే ఎందుకు ఎంపిక చేశారన్న జర్నలిస్ట్ ప్రశ్నకు సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.