కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ దగ్దమైంది. ఎండ వేడితో రన్నింగ్ లో ఉన్న బైక్ హీటెక్కి కాలిపోయినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని అహల్యా నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో బైక్ వదిలి ఆ యువకులు పారిపోయారని స్థానికులు తెలిపారు. ఎండ వేడి వల్ల బైక్ దగ్దమైందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.