నేషనల్ హెరాల్డ్ కేసు జాతీయ స్థాయిలో మరోమారు రాజకీయంగా కుదుపు కుదిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED అధికారులు మంగళవారం ఈ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో మెుదటి సారి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఏ1గా, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఏ2గా పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందని మండిపడ్డాయి. ఈ మేరకు బుధవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి.