తెలంగాణలో ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారానే వ్యవసాయ భూముల నిర్వహణ సాగనుంది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలన్నీ ఇక్కడే తెలుసుకోవచ్చు. అయితే ఇందులో కొన్నింటికి ప్రభుత్వం ఫీజులను నిర్దేశించింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ గా పలు మండలాల్లో మాత్రమే ఈ సేవలు ప్రారంభం కాగా… త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.